Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ఈడీ వద్ద తగినంత ఆధారం ఉందని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. దాంతో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత సమాచారం, ప్రూఫ్స్ ఈడీ వద్ద ఉన్నాయని.. అలాగే కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడం, అలాగే ఆయన వల్ల జరిగిన జాప్యం వల్ల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిందని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టు అవసరంపై మంగళవారం తీర్పునిచ్చింది.
Also read: TDP: విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించిన టీడీపీ.. మొదటి డొనేషన్ ఎంతో తెలుసా..?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఇక ఈ కేసులో భాగంగా రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉంటుందని., రాజకీయ నైతికతకు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా కోర్టు రాజకీయాల జోలికి వెళ్లదని., అరెస్టు సమయాన్ని ఈడీ నిర్ణయించినట్లు తాను భావించబోమని., కేసు ఏదైనా అందులోని నిందితుల అరెస్ట్ చట్ట ప్రకారం పరిశీలించి చేయాల్సి ఉంటుందని., ఎన్నికల సమయం ప్రకారం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను ఇప్పుడు అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది.
Also read:Margani Bharat: డబుల్ ఇంజిన్, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఫలితాలు శూన్యం
చట్టం అందరికీ ఒకే ‘లా’ ఉంటుందని.., కోర్టు వివిధ కేటగిరీలకు చట్టాలు ఉన్నాయని.. ముఖ్యమంత్రిగా ఆయనకీ ఎలాంటి ఇమ్యూనిటీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆప్ అధినేతను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఉత్తర్వుతో సహా ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సమర్థించారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ పాత్ర లిక్కర్ పాలసి రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఇందుకు సంబంధించి ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ ప్రధాన పాత్ర ఉందని కోర్టు పేర్కొంది. ఇక ముఖ్యంగా తమకు ఉన్న అంశం కేవలం కేజ్రీవాల్, దర్యాప్తు సంస్థ ఈడీ మధ్య మాతరమే అని.. కేంద్ర ప్రభుత్వానికి, ఆప్ అధినేతకు మధ్య వివాదం కాదని కోర్టు క్లియర్ గా పేర్కొంది.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!