వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
జనసేన పార్టీ తరపున తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలిచే తన పార్టీ అభ్యర్థులను జనసేన మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.