KCR : కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా.. నిరుద్యోగ భృతి వచ్చిందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వర్షం కురిసిన ఇంతమంది వచ్చారు మీకందరికీ ధన్యవాదాలు తెలిపారు. చైతన్యవంతమైన మెదక్ లో మీరు మంచి తీర్పు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. అనేక వాగ్దానాలు చేసి అబద్దాలతో అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. ఉచిత బస్సుతో మహిళలు కోటుకుంటున్నారు…ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, రైతు బంధు డబ్బులు అందరికి వచ్చాయా..పాత పథకాలు కూడా సరిగా అమలు చేయడం లేదన్నారు కేసీఆర్. గతంలో 30 వేల కోట్లు రుణమాఫీ చేశామని, సీఎం రేవంత్ చెప్పిన 2 లక్షల ఋణమాఫీ జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న స్కీములు అమలు కావడం లేదని, సీఎం రేవంత్ మెదక్ జిల్లాని తీసేసెటట్టు ఉన్నారని కేసీఆర్ విమర్శించారు. మెదక్ జిల్లా ఉండాలంటే BRS ఎంపీ అభ్యర్థి గెలవాలని, నేను మెదక్ జిల్లా వాడినే కాబట్టి ఈ జిల్లాని అభివృద్ధి చేసుకున్నామన్నారు కేసీఆర్.
అంతేకాకుండా.. ‘100 పడకల ఆస్పత్రి మెదక్ కి ఇస్తే దానిని 50 పడకలకు కుదించింది కాంగ్రెస్, ఏడు పాయల కోసం 100 కోట్లు ఇస్తే వెనక్కి తీసుకువెళ్లిపోయారు, పాత ప్రభుత్వంలో ఇచ్చిన మంజూరులన్ని ఆపేశారు, ప్రధాని మోడీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చి 150 హామీలు ఇచ్చారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు.. మోడీ హయాంలో జరిగిందా, కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా..నిరుద్యోగ భృతి వచ్చిందా. మోడీ గోదావరి నదిని తమిళనాడు కి అప్పచెబ్బుతాను అంటున్నారు. కృష్ణా నదిని KRMB కి అప్పచెప్పారు. తొమ్మిది ఏళ్లపాటు నేను ఒక్క నిమిషం కరెంట్ పోకుండా ఇస్తే వీళ్లకు చేత కావడం లేదు. మంచినీళ్లు కూడా సరిగా రావడం లేదు. అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులకు శాపంగా మారింది. ఆగమాగం జగన్నాథం కావద్దు. గోదావరి మాయమైతే మన రాష్ట్ర గతి ఏం కావాలి. కర్ణాటక, తమిళనాడు కి తరలిపోతే మన పరిస్థితి ఏంటి…? తెలంగాణ ఉద్యమంలో నన్ను మీరు అందరూ దీవించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నమి ఓటేశారు. మళ్ళీ తెలంగాణ నిలబడాలంటే BRS గెలవాలి. బీజేపీ అభ్యర్థి నోటికి ఎదివస్తే అదే మాట్లాడుతారు. మోడీ ది గ్యాస్… రఘునందన్ ది గ్యాస్, నేను ఇదే జిల్లా బిడ్డను..మీ కోసం ఏం చేశానో మీకు తెలుసు, నేనే వెంకట్రామిరెడ్డి ని మెదక్ నుంచి నిలబడాలని చెప్పాను’ అని కేసీఆర్ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?