Kawasaki KLX 230: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కవాసాకి (Kawasaki) భారత మార్కెట్లో తన కొత్త KLX 230 డ్యూయల్-స్పోర్ట్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. KLX 230, కవాసాకి బ్రాండ్‌లోని రోడ్-లీగల్ డ్యూయల్-స్పోర్ట్ సెగ్మెంట్‌లో అత్యంత చిన్న బైక్. కవాసాకి KLX 230 బైక్ స్లీక్, మంచి డిజైన్‌తో అందుబాటులో ఉంది. దీని స్టైలింగ్‌లో హెక్సాగోనల్ హెడ్‌లైట్, దాని చుట్టూ ప్లాస్టిక్ కౌల్ ఉంటాయి. దీని పొడవైన ఫ్రంట్ ఫెండర్ దీనిని ఆఫ్ రోడర్‌గా వీలు కల్పిస్తుంది. బైక్ స్లిమ్ సీటింగ్, పైకి ఉన్న ఎగ్జాస్ట్‌లతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. డిజిటల్ LCD డిస్ప్లే, స్విచ్ చేయగల డ్యూయల్-చానల్ ABS వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక KLX 230లో 233cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అందించబడింది. ఇది 18.1bhp పవర్, 18.3Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. దీని ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ దీర్ఘకాల ప్రయాణాల కోసం మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి.
Also Read: New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల ఆహ్వానం అందిన వారికి కండోమ్‌లతో పాటు ఇతర వస్తువులు..
KLX 230లో ముందూ వెనుకా డిస్క్ బ్రేక్‌లను అందించారు. ఇవి అత్యుత్తమ బ్రేకింగ్ అనుభవాన్ని కల్పిస్తాయి. 21-అంగుళాల ముందు, 18-అంగుళాల వెనుక స్పోక్ వీల్స్ రోడ్, ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అనుకూలమైన టైర్లతో వస్తాయి. కవాసాకి KLX 230 ధర రూ. 3.30 లక్షలు. కాబట్టి, ఇది ప్రీమియం సెగ్మెంట్‌లోకి వస్తుంది. భారత మార్కెట్లో ఈ బైక్ Hero Xpulse 200 4Vతో పోటీపడుతుంది. దీని ధర KLX 230 కంటే సగం మాత్రమే. Hero Xpulse డకార్ ఎడిషన్ అధునాతన ఫీచర్లతో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తుంది. మొత్తానికి కవాసాకి KLX 230 ప్రీమియం బైక్‌లను కోరుకునే వారికి అధునాతన ఫీచర్లు, విశ్వసనీయ ఇంజిన్ పనితీరుతో ఒక మంచి ఎంపికగా ఉంటుంది. అయితే, దీని ధర బడ్జెట్-సవాళ్లతో కూడినది.