New Year Celebrations: నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే పుణేలోని ఒక పబ్ నిర్వహించిన కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త సంవత్సరం సంబరాలకు పబ్ నుండి పంపించిన ఆహ్వానంలో కండోమ్స్ తోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై పుణే పోలీసులు విచారణ ప్రారంభించారు. పుణేలోని ఒక పబ్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఒక ప్రత్యేక పార్టీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి పంపిన ఆహ్వానంలో కండోమ్స్ తోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా పంపారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.
Also Read: WhatsApp Update: డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకరాబోతున్న వాట్సాప్
మహారాష్ట్ర యువ కాంగ్రెస్ సభ్యుడు అక్షయ్ జైన్ ఈ విషయంపై స్పందిస్తూ.. మేము పబ్, నైట్‌లైఫ్‌ను వ్యతిరేకించడం లేదని.. కానీ, ఈ విధమైన మార్కెటింగ్ వ్యూహాలు పుణే నగరపు సంప్రదాయాలను దెబ్బతీస్తాయని తెలిపారు. ఇది పూర్తిగా అనుచితమని భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు కండోమ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉన్న ఫోటోలు కూడా పోలీసులకు అందజేశారు. పబ్ మేనేజ్మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Rohit Sharma: కెప్టెన్ కావడం వల్లే రోహిత్ ఇంకా ఆడుతున్నాడు: ఇర్ఫాన్
ఈ విషయంపై పుణే పోలీసులు ఫిర్యాదును ధృవీకరించారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మేము ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నామని, విషయం గురించి లోతుగా విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన పుణే నగరంలో విస్తృత చర్చకు దారి తీసింది. కొంతమంది ఈ విషయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు దీనిని జీవనశైలి మార్పుకు సంకేతంగా చూస్తున్నారు. ఈ వివాదంపై పోలీసుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సర వేడుకలకు ముందు ఇలా వివాదం తలెత్తడం పబ్ మేనేజ్మెంట్‌ను కూడా షాక్‌కు గురి చేసింది.