Off The Record: జాగృతి జనం బాటలో కవిత కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారా? ఆమె తీరు గులాబీ దళానికి అస్సలు మింగుడు పడ్డం లేదా? ఏదైతే అదైంది ఇక నుంచి ఫుల్ స్వింగ్‌లో రివర్స్ అటాక్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారా? ఇంతకీ కవిత తీరులో కనిపిస్తున్న మార్పు ఏంటి? రాష్ట్ర పర్యటనలో ఆమె ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికి ఏడు జిల్లాల టూర్ పూర్తయింది. అయితే……
కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.
తండ్రికి కూతురు రాసిన లేఖ బయటకి ఎలా వచ్చింది? అది కూడా రాసిన 20 రోజుల తర్వాత బయట పెట్టడం వెనక వ్యూహం ఏంటి? కేసీఆర్ విషయంలో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం.. ఆయనకు ఇబ్బందికరమైన అంశాలు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? అసలు లేఖను బయటపెట్టిన లీకు వీరులు ఎవరు?