Karnataka Cricketer Record: వన్డే క్రికెట్లో సంచలనం.. 165బంతుల్లో 407పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Cricketer Record: వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు డబుల్.. ట్రిపుల్ సెంచరీలను చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా ఒకే మ్యాచ్ లో 400పరుగులకు పైగా చేసి ఓ కుర్రాడు అందరికీ అవాక్కయ్యేలా చేశాడు. కలలో కూడా ఊహించని ఫీట్ సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. గతంలో సచిన్ వన్డే మ్యాచ్ లో 200కొడితేనే ప్రపంచం అబ్బురపడింది. అలాగే టెస్టుల్లో 400కొడితే అమోఘం అన్నారు. ఏకంగా వన్డేలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 407పరుగులు సాధించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును నమోదు చేశాడు కర్ణాటకకు చెందిన తన్మయ్ మంజునాథ్. కర్ణాటక క్రికెట్ సంఘం అండర్-16 టోర్నీలో ఈ పిల్లవాడు చిచ్చరపిడుగులా చెలరేగి చరిత్ర సృష్టించాడు. 50ఓవర్ల మ్యాచ్ లో కేవలం 165 బంతుల్లోనే ఏకంగా 48 ఫోర్లు, 24 సిక్సులతో 407 పరుగులు చేసి.. వన్డే మ్యాచ్‌లో అద్భుతం చేసి చూపించాడు.
Read Also: Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఆదివారం సాగర్ క్రికెట్ క్లబ్-భద్రావతి ఎన్టీసీసీ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో తన్మయ్ మంజునాథ్ సాగర్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగాడు. దిగిదిగడంతోనే భద్రావతి బౌలర్ల భరతం పట్టాడు. కొడితే సిక్స్ లేదంటే.. ఫోర్ అనే విధంగా బ్యాటింగ్ చేస్తూ.. చరిత్ర ఇంతవరకూ కనివినీ ఎరుగని రికార్డును నమోదు చేశాడు. మంజునాథ్ కర్ణాటకలోని శిమమొగ్గా ప్రాంతానికి చెందిన వాడు. సాగర్ క్రికెట్ క్లబ్ తరఫున అండర్ 16 పోటీల్లో పాల్గొంటున్నాడు.
Read Also: The Vaccine War: ఆ టైటిల్ ఎందుకు పెట్టానో తెలుసా?.. వివేక్ అగ్నిహోత్రి ట్విట్ వైరల్..
కాగా.. 2014 నవంబర్ 13న శ్రీలంక-భారత్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ వన్డేల్లో ఏకంగా 264 పరుగులు బాదేసి.. ప్రపంచ క్రికెట్ నివ్వెరపోయేలా చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సృష్టించిన సునామీ ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డుగా ఉండిపోయింది. రోహిత్ సునామీకి సరిగ్గా 8 ఏళ్లు పూర్తయిన రోజునే మంజునాథ్ వన్డే మ్యాచ్‌లో ఏకంగా 407 పరుగులు బాదేసి మరో వరల్డ్ రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో మంజునాథ్ పేరు మార్మోగిపోతుంది.
New #worldrecord set by 16 year old boy Tanmay Manjunath frm Sagar, Shivamogga. He scored 407 runs in 165 balls against Bhadravathi NTCC at #KSCA under 16, 50 overs inter district tournament. He had hit 48 boundaries & 24 Sixes. He was representing Sagar #Cricket club. 1/2 pic.twitter.com/BK12x3xXo1
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) November 12, 2022
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!