Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheru Weds Sweety : జీవితంలో జరిగే అతిపెద్ద పండుగ పెళ్లి. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజానికి పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. అలాంటి పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు. పూర్వం పెళ్లి అంటే ఐదు రోజుల పండుగలా నిర్వహించేవారు. పెద్దలు కూడా తమ బిడ్డల పెళ్లిని ఆకాశమంత పందిరి కింద ఒక తరం పాటు గుర్తుండిపోయేలా చేయాలని కలగంటారు. ఈ క్రమంలో పెళ్లికి తమ వాళ్లందరినీ ఆహ్వానించి బిడ్డల పెళ్లి చేసి ఆనందపడుతారు. గురుగ్రామ్ లో కూడా అలాంటి పెళ్లే జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో చూస్తే పెళ్లి ఏర్పాట్లను చూసి ఆశ్చర్య పోతారు. కానీ పెళ్లికూతురు, కుమారులను చూస్తేనే షాక్ అవుతారు. కాకాపోతే ఇది మనుషుల పెళ్లికాదు కుక్కల పెళ్లి. అవునండి మీరు చదివింది…. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి సామెత విన్నాం కానీ కుక్కల పెళ్లికి మనుషుల హడావుడి అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
Read Also: Hardik pandya Hair stylist: న్యూ లుక్ లో రచ్చరేపుతున్న సినీ క్రీడా సెలబ్రెటీలు
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
అసలు విషయం ఏంటంటే.. గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లోని జిలే సింగ్ కాలనీలో షేరు అనే మగ కుక్క స్వీటీ అనే ఆడకుక్కను వివాహం చేసుకుంది. భారతీయ ఆచారాలకు తగ్గట్టు వాటి యజమానులు పెళ్లి నిర్వహించారు. ఇరుగుపొరుగు వారందరూ ప్రేమగా ఆనందంతో పెళ్లిలో పాల్గొన్నారు. స్వీటీ(ఆడకుక్క) యజమాని సవిత మాట్లాడుతూ.. తన భర్త గుడి సమీపంలోని కుక్కలకు రోజు ఆహారం ఇచ్చేవాడని… ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుంటే ఓ కుక్క తనను అనుసరించిందని తెలిపింది. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో అప్పటినుంచి స్వీటీ పేరుపెట్టి సాదుకుంటున్నట్లు తెలిపింది. వారు నివసించే పక్క ఇంట్లో షేరు అనే మగ కుక్క ఉండేది. పెళ్లి ప్రపోజ్ చేయగా అందుకు వాళ్లు అంగీకరించారు. చివరకు నాలుగు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశాం అని సవిత తెలిపింది.
వరుడు షేరు(మగకుక్క) తల్లి మణిత మాట్లాడుతూ.. షేరును ఎనిమిదేళ్లుగా తమ కొడుకులాగా పెంచుకుంటున్నామని… స్వీటీతో పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒప్పుకున్నామన్నారు. అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ పెళ్లికి 100 మందిని ఆహ్వానించారు. 25 పెళ్లి పత్రికలను కూడా ముద్రించిన ఆహ్వానాలు ,ఆన్‌లైన్ ఆహ్వానాలు కూడా పంపారు.
#WATCH via ANI Multimedia | ‘Sheru weds Sweety; Neighbourhood comes alive amid ‘furry’ wedding festivities in Gurugram, Haryana.https://t.co/60mW9P4V5d
— ANI (@ANI) November 14, 2022
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..