కన్నడ సినీ పరిశ్రమ నుంచి విడుదలైనప్పటికి.. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన డివోషనల్ యాక్షన్ డ్రామా “కాంతారా చాప్టర్ 1” ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి స్వయంగా ఈ కథను నిర్మించి, దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఆయన యాక్టింగ్, సంస్కృతి–భక్తి కలయిక సినిమా విజయానికి ప్రధాన హైప్‌గా నిలిచాయి. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.
Also Read : Andhra King Thaluka : శాటిలైట్ నుంచి ఓటీటీ వరకు.. ‘ఆంధ్ర కింగ్ తాలుకా ’ హక్కులపై గ్రాండ్ డీల్!
ఇక డీలింగ్ ప్రకారం గత నెలలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన హిందీ వెర్షన్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. దీంతో థీయెటర్ లో మిస్ అయిన హిందీ ఆడియన్స్‌కు కూడా చూడవచ్చ. బాక్సాఫీస్ విషయానికొస్తే, ‘కాంతారా చాప్టర్ 1’ హిందీ వెర్షన్ 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ రేంజ్‌లో వసూళ్లు రాకపోవడం బాలీవుడ్‌లోనూ పెద్ద చర్చకుదారితీసింది.
రిషబ్ శెట్టిని మరోసారి ఇండియా స్థాయి స్టార్‌గా నిలబెట్టింది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే ఒక ప్రత్యేకంగా నిలిచింది. రుక్మిణి వసంత్, జైరాం తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ప్రస్తుతం హిందీలో OTT కి రావడం వల్ల ఈ చిత్రం మరిన్ని భాషల ప్రేక్షకులను చేరుకోనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.