Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
- దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పొదుపు మంత్రం
- పౌరులకు ప్రధాని మోడీ జాగ్రత్తలు
- పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా సీరియస్‌గా అమలవుతోంది. పౌరులంతా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు సీనియర్ నటుడు, ఎంపీ కమల్‌హాసన్ కీలక సూచన చేశారు. ‘‘ప్రతి ప్రేమకథ తప్పనిసరిగా పారిస్‌లోనే మొదలవ్వాలా..? ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ముగియాలా..?’’ అంటూ కమల్ హాసన్ సినీ పరిశ్రమలో వనరుల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, ఇంధన సంక్షోభ పరిస్థితుల్లో సినీ పరిశ్రమ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అవసరం లేని విదేశీ షూటింగ్‌లు, భారీ ఖర్చులను తగ్గించి వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Also Read
స్థానిక ప్రాంతాలు, దేశీయ పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించేలా సినిమాలు నిర్మిస్తే పరిశ్రమకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.
"Why must every love story bloom only in Paris, every honeymoon end in Switzerland?": Kamal Haasan calls for judicious use of resources in film industry
Read @ANI Story | https://t.co/164YP4LCVY#KamalHaasan #FilmIndustry #Resources #WestAsiaConflict pic.twitter.com/4Yj3ay4M7E
— ANI Digital (@ani_digital) May 15, 2026
తాజావార్తలు
-
Cancer Injection: భారత్‌లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!