Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ‘పెద్ది’ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల ఏడు సెకండ్ల పాటు సాగింది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా, అతని క్యారెక్టర్ మీద మరింత అంచనాలతో పాటు ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు. బొమన్ ఇరానీ క్యారెక్టర్, “ఇక్కడ ఉన్న ప్రతి కుర్రాడికి ఫేవరెట్ గేమ్ మారుతుందేమో కానీ, ఫేవరెట్ ప్లేయర్ మాత్రం పెద్ది అవుతున్నాడు. అతనేమైనా దేవుడా అంటే.. అతను గుళ్లో దేవుడు కాదు, గ్రౌండ్లో దేవుడు” అంటూ ఈ సినిమాకి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎంత ముఖ్యమో చెప్పేలా ఒక డైలాగ్ ఉంది. తర్వాత “ఆటే నా పొగరు” అంటూ రాంచరణ్ చెబుతున్న డైలాగ్ మరింత ఆసక్తి పెంచేలా ఉండగా, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అనుమానాలు రేకెత్తించేలా ఉంది.
ఎందుకంటే, ఆమె పాత్ర ఎమ్మెల్యే కుమార్తె పాత్ర అని చెప్పారు కానీ, ట్రైలర్ కట్ మాత్రం అందుకు భిన్నంగా అనిపిస్తోంది. మరోపక్క అప్పలసూరిగా జగపతిబాబుని కూడా రెండు షాట్స్‌లో చూపించి, ఇది వేరే ఇష్యూ ఏదో కూడా డీల్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరోపక్క దివ్యాందు శర్మ “ఆట కూలి నా కొడుకు” అంటూ రాంచరణ్ పాత్రను మెన్షన్ చేస్తూ చెప్పిన డైలాగ్స్‌తో పాటు, రామ్ చరణ్ అండ్ టీం ఆట వస్తువులతో పాటు కొండలు, గుట్టలు దాటి వెళుతున్నట్లు కనిపిస్తున్న షాట్స్ సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. క్రికెట్‌తో పాటు కుస్తీ, అలాగే రన్నింగ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతోందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. ట్రైలర్‌తో అసలు కథ రివీల్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ, కథ పూర్తిగా రివీల్ కాకుండానే సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్.
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!