Cancer Injection: భారత్‌లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్..
- రోష్ ఫార్మా ఇండియా ‘టెసెంట్రిక్’ ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్..
- ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు..
- లంగ్ క్యాన్సర్‌కు ఉపయోగపడే ఇంజెక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer Injection: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్. క్యాన్సర్ సోకితే పలు దశల్లో చేయించుకునే ‘‘కీమో థెరపీ’’ బాధల నుంచి విముక్తి కలిగించే చికిత్స విధానం వచ్చింది. భారత్‌లో లంగ్ క్యాన్సర్‌కు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ రోష్ ఫార్మా ఇండియా ‘‘టెసెంట్రిక్’’ అనే కొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్‌ను తీసుకువచ్చింది. ఇది కేవలం 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది.
ఇప్పటి వరకు ఇమ్యునోథెరపీ కోసం రోగులు గంటల తరబడి ఐవీ ద్వారా మందులు ఎక్కించుకోవాల్సి వచ్చేది. కానీ ఈ ఇంజెక్షన్ వల్ల చికిత్స సమయం భారీగా తగ్గుతుంది. ఈ కొత్త ఇంజెక్షన్ ముఖ్యంగా నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC) బాధితులకు ఉపయోగపడనుంది. భారతదేశంలో ఎక్కువగా కనిపించే లంగ్ క్యాన్సర్లలో ఇది ఒక రకం. చికిత్స సమయం తగ్గడం, ఆస్పత్రుల్లో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ఎలా పనిచేస్తుంది.?
ఈ ఇంజెక్షన్లో ‘‘అటెజోలిజుమాబ్’’ అనే ఇమ్యునోథెరపీ ఔషధాన్ని ఉపయోగిస్తారు. సాధారణ కీమోథెరపీలా ఇది క్యాన్సర్ కణాలపై పనిచేయదు. దీనికి బదులుగా శరరీంలోని రోగ నిరోధక వ్యవస్థకు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని అంతం చేసేలా సాయపడుతుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు PD-L1 అనే ప్రోటీన్ ద్వారా ఇమ్యూన్ సిస్టమ్‌కు దొరక్కుండా దాక్కుంటాయి. టెసెంట్రిక్ ఆ ప్రొటీన్‌ను అడ్డుకుంటుంది. దీని ద్వారా మందు క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించి అటాక్ చేయగలదు. కీమోథెరపీలో మందులు ఆరోగ్యవంతమైన కణాలతో పాటు క్యాన్సర్ కణాలపై కూడా దాడి చేస్తాయి. కానీ ఈ ఇంజెక్షన్ కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
ధర వింటే షాక్..
ఇదంతా బాగానే ఉన్నా, ఈ మందు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉంది. దీని ఒక్క డోస్ ధర రూ. 3.7 లక్షల వరకు ఉంటుంది. చాలా మంది రోగులకు 6 డోసులు అవసరం అవుతుంది. దీంతో మొత్తం ఖర్చు లక్షల్లోకి వెళ్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలు భరించలేని ధర.
ఎవరికి ప్రయోజనం..?
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం, ఈ మందును అందరు రోగులకు ఇవ్వరు. రోగి ట్యూమర్లో PD-L1 ప్రోటీన్ స్థాయిలను ముందుగా పరీక్షిస్తారు. ఎక్కువ డోస్ స్థాయిలో ఈ ప్రొటీన్ ఉన్న రోగులు ఈ చికిత్సకు బాగా స్పందించే అవకాశముందని చెబుతున్నారు. రోగి ఆరోగ్య స్థితి, క్యాన్సర్ దశ ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..