Kamal Hassan: లంచానికి థ్యాంక్స్ చెప్పిన కమల్ హాసన్
- 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ లంచానికి థ్యాంక్స్ చెప్పిన కమల్ హాసన్
- అది ఉంది కాబట్టే 28 సంవత్సరాల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్న కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Hassan: హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లంచానికి థ్యాంక్స్ చెప్పారు. అది అందరికీ ఈజీగా అర్థం అయ్యే భాష అని.. అది ఉంది కాబట్టే 28 సంవత్సరాల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్నారు. డైరెక్టర్ శంకర్ ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ సినిమాగా చేశారని కమల్ ప్రశంసలు కురిపించారు.
Read Also: Director Shankar: గేమ్ చేంజర్ రిలీజ్‌కి రెడీ.. కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ఇండియన్ 3 బాగుంది అంటే ఇండియన్ 2 బాలేదు అని అపార్థం చేసుకుంటున్నారని కమల్ అన్నారు. ఇండియన్ 2 అద్భుతంగా ఉంటుందనని.. కానీ తాను వ్యక్తిగతంగా ఇండియన్-3 కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ‘ఇండియన్-2’నే ఇండియన్ 3 అని.. ఇండియన్-3యే ఇండియన్-2 అని కమల్ హాసన్ అన్నారు. ఈ సినిమా కొనుక్కోండి అని కమల్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సిగ్గు లేదన్నారు. మంచి ప్రొడక్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. అందులో తప్పేం లేదన్నారు. పళ్లమ్ముకునే వాళ్లే వాళ్లు దగ్గర ఉన్న పళ్ల గురించి చెప్పి అమ్ముకుంటారు.. మేము కూడా ఒక మంచి సినిమా చేశాం.. మా సినిమాను కొనుక్కోండి.. మా ప్రొడక్ట్ ను కొనుక్కోండి.. ఇలా చెప్పుకునేందుకు సిగ్గు లేదని కమల్ హాసన్ అన్నారు. ఎందుకంటే ఇది మా జాబ్ అంటూ కమల్ చెప్పుకొచ్చారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పాల్సిన మాటలన్నీ నా వాయిస్‌లో బ్రహ్మానందం చెప్పేశారు. 52 ఏళ్ల క్రితం టెక్నీషియన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మూడు తరాలు నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. నా జీవితంలో తెలుగుకి గొప్ప స్థానం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి నా జీవితంలో వచ్చాయి. బాలచందర్, విశ్వనాథ్ వంటి వారు భాషాబేధాలను తుడిచిపారేశారు. ఇండియన్ 2 ఇప్పటి తరానికి రిలవెంట్గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రతిభను పట్టుకొచ్చి అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సినిమానే మీ అందరితో మాట్లాడుతుంది. ఈ మూవీ సెట్లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. నాలో సేనాపతి వచ్చాడు. అందుకే కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు. ఇండియన్ 2 జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి. నేను ఈ సినిమాలో నటించాను. ఈ మూవీకి నేను అభిమానిని. చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. మంచి క్వాలిటీతో సినిమాను తీశాం. అందరూ చూడండి. ఈ మూవీకి ఆరుగురు టాప్ స్టంట్ మాస్టర్స్ పని చేశారు. ఏసియన్ సురేష్, శ్రీలక్ష్మీ మూవీస్ మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.జూలై 12 కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!