Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’. సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జైలర్ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబట్టి రజనీ మాస్ పవర్ ఏంటో చూపించింది. ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ పై కాస్త మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ నెల్సన్ మ్యాజిక్ రజినీ స్టార్ పవర్ కలిసి మ్యాజిక్ జరుగుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఈనెల 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్‌ను కేటాయించింది. అలాగే సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా లాక్ అయింది. రజనీకాంత్ మాస్ మేనియా, నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, అనిరుధ్ బ్లాక్‌బస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలగలిపిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ‘కూలీ’ సినిమా ‘A’ సర్టిఫికేట్ సాధించడం వల్ల కలెక్షన్ల పరంగా కొంత మేర నష్టపోయినప్పటికీ, ‘జైలర్ 2’ చిత్రం కుటుంబ ప్రేక్షకులందరూ చూసేలా ‘U/A’ తో రావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద ‘సంభవం’ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ శనివారం రోజున విడుదల కానున్న రజనీకాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూతో సినిమాపై ఉన్న హైప్ మరింత పీక్స్‌కు చేరనుంది. ఈ ఇంటర్వ్యూలో థలైవర్ తనదైన శైలిలో అందించే లైఫ్ లెసన్స్, సరదా ముచ్చట్లు అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read
- Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Tags
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!