144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- భారత మార్కెట్లో Vivo V80 విడుదల
- 6.59 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్
- జైస్ భాగస్వామ్యంతో 50Mp ప్రధాన కెమెరా, 8Mp అల్ట్రా-వైడ్, 50Mp పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు
- 7,200mah భారీ బ్యాటరీతో పాటు 90W ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V80: వివో (Vivo) V-సిరీస్‌లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. vivo V80 పేరుతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ముఖ్యంగా మొబైల్ కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ZEISS భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన కెమెరా వ్యవస్థ, అధునాతన ఏఐ ఫీచర్లు, 144Hz AMOLED డిస్ప్లే, భారీ 7,200mAh బ్యాటరీ, IP69 రేటింగ్ వంటి ప్రత్యేకతలను ఇందులో అందించారు.
ZEISS కెమెరా వ్యవస్థ
ఈ కొత్త స్మార్ట్ మొబైల్ లో కెమెరా విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. వెనుక భాగంలో ZEISS సహకారంతో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో సోనీ LYTIA-700V సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ప్రధాన కెమెరాకు OIS సపోర్ట్ ఉండగా, టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 100x వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
- Huawei Pura 90 Plus: Huawei Pura 90 Plus లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!
- Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ కోసం 23mm, 35mm, 50mm, 85mm, 100mm అనే ఐదు ఫోకల్ లెంగ్త్ ఆప్షన్లను అందించారు. వీటికి ZEISS బొకే సిమ్యులేషన్స్ కూడా జత చేశారు. ముందు భాగంలో 50MP ZEISS గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, 92 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఫేషియల్ కాంటూరింగ్ అల్గారిథమ్స్‌తో పనిచేస్తుంది.
వీడియో క్రియేటర్ల కోసం ఇందులో 4K వీడియోను 60fps వరకు రికార్డ్ చేసే సదుపాయం ఉంది. వీడియోలకు ప్రత్యేక లుక్ అందించేందుకు Modern Movie, Vibrant, Pastel అనే మూడు సినిమాటిక్ కలర్ ప్రొఫైల్స్ అందించారు. AI Creative Cameraలో 30కి పైగా ప్రీసెట్ విజువల్ స్టైల్స్ ఉన్నాయి. అంతేకాకుండా AI Diwali Portrait 2.0 ద్వారా పండుగల థీమ్‌తో పోర్ట్రెయిట్ ఫొటోలు తీసుకోవచ్చు. AI Retouch ఫీచర్ ద్వారా ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌ను పెంచుకోవడం, అనవసరమైన వస్తువులను తొలగించడం, వాటి స్థానాన్ని మార్చడం వంటి ఎడిటింగ్ పనులు చేయవచ్చు.
144Hz 1.5K AMOLED డిస్ప్లే
vivo V80లో 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 4320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ కూడా ఉంది. లోకల్ పీక్ బ్రైట్నెస్ 5,000 నిట్స్ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. కేవలం 0.125 cm బెజెల్స్‌తో స్క్రీన్కు అధిక స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి లభిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్
మొబైల్ పనితీరు కోసం 4nm టెక్నాలజీపై రూపొందించిన Qualcomm Snapdragon 7 Gen 4 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 722 GPU ఉంది. ఫోన్ 8GB LPDDR4X RAMతో వస్తుంది. స్టోరేజ్ పరంగా 128GB, 256GB, 512GB UFS 3.1 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
7,200mAh బ్యాటరీ..
ఈ స్మార్ట్ ఫోన్ లో 7,200mAh బ్యాటరీని అందించారు. ఇది ఇప్పటివరకు V-సిరీస్‌లో అందించిన అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ పేర్కొంది. బ్యాటరీకి 90W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ భారీ బ్యాటరీ ఉపయోగకరంగా ఉండనుంది.
IP69 రేటింగ్..
ఫోన్ బాడీని కోల్డ్-కార్వ్డ్ గ్లాస్ రియర్ ఫినిష్, హై-స్ట్రెంగ్త్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో రూపొందించారు. ఫోన్ మందం కేవలం 7.69mm కాగా, బరువు 203 గ్రాములు. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్స్ అందించారు. ఇన్-డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో సపోర్ట్ కూడా ఉన్నాయి.
OriginOS 7తో తొలి V-Series ఫోన్
సాఫ్ట్వేర్ పరంగా vivo V80 ప్రత్యేకతను సంతరించుకుంది. OriginOS 7తో నేరుగా వచ్చే తొలి V-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే. పనితీరును మెరుగుపరిచేందుకు Origin Smooth Engineను అందించారు. కెమెరాతో ఫొటో తీసిన టెక్స్ట్‌ను ఎడిట్ చేయగల నోట్స్‌గా మార్చేందుకు Snap Note ఫీచర్ ఉంది. అలాగే వివిధ పరికరాల మధ్య వర్క్‌ఫ్లోను సులభతరం చేసేందుకు vivo Office Kit అందించారు. ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
ధర ఎంతంటే?
vivo V80ను Sunrise Anthem, Horizon Blue, Stellar Black అనే మూడు రంగుల్లో విడుదల చేశారు. ధరల విషయానికి వస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999గా ఉంది. 8GB + 256GB మోడల్ ధర రూ.69,999 కాగా, 8GB + 512GB టాప్ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు.
vivo V80 ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సాధారణ విక్రయాలు అక్టోబర్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. వివో అధికారిక ఆన్లైన్ స్టోర్‌తో పాటు Amazon, Flipkart, అధీకృత రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
లాంచ్ ఆఫర్లు..
మొబైల్ కొనుగోలుదారులకు పలు లాంచ్ ఆఫర్లు అందిస్తున్నారు. ఆఫ్‌లైన్ కొనుగోలుపై ఎంపిక చేసిన బ్యాంకులు, UPI ద్వారా 10% వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా 10% వరకు V-Upgrade ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. వీటితోపాటు V-Shield స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ప్లాన్ ధర రూ.1,134 నుంచి ప్రారంభమవుతుంది.
ఆన్లైన్ కొనుగోలుదారులకు ఎంపిక చేసిన బ్యాంకులపై 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, 10 శాతం ఎక్స్చేంజ్ బోనస్, ఒక సంవత్సరం ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆరు నెలల పాటు 100GB Google One క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తున్నారు.
వీటితోపాటు కొనుగోలుదారులకు త్వరలో JioHotstar వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై 50 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. రూ.499 విలువైన Mobile Planను రూ.249.50కే, రూ.1,099 విలువైన సూపర్ ప్లాన్ ను రూ.549.50కే పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!