Kamal Haasan: కావాలనే నా రెమ్యునరేషన్ పెంచా.. కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- జులై 12న భారతీయుడు2
- ట్రైలర్ విడుదల
- అందరి మైండ్ సెట్ మారాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan on Bharateeyudu Remuneration: బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ గురించి లోకనాయకుడు కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుడు సినిమాలో తాను భాగం కావాలనుకోలేదని తెలిపారు. డైరెక్టర్ ఎస్ శంకర్ తనంతట తానుగా తనను తప్పించాలని కావాలనే రెమ్యునరేషన్ పెంచానని, కానీ నిర్మాతలు అంగీకరించడంతో సినిమాలో నటించానని చెప్పారు. శంకర్ పట్టుదల తాను ఆశ్యర్చపోయానని కమల్‌హాసన్ పేర్కొన్నారు. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.
చిత్ర యూనిట్ భారతీయుడు 2 ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ.. భారతీయుడు రోజులను గుర్తుచేసుకున్నారు. ‘అవినీతి విషయంలో అందరి మైండ్ సెట్ మారాలి. భారతీయుడు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు రాలేదు. పార్ట్ 2 అంతా అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కించారు. సినిమా చూశాక చాలామంది ఆలోచిస్తారు. నేను గతంలో నటించిన కొన్ని చిత్రాల్లోని పాత్రలతో పోలిక ఉండడంతో భారతీయుడులో భాగం కావాలనుకోలేదు. అందుకే డైరెక్టర్ శంకర్ తనంతట తానుగా నన్ను తప్పించాలని ఓ ప్లాన్ వేశా. కావాలనే నా రెమ్యునరేషన్ పెంచాను. నిర్మాతలు నా డిమాండ్లకు అంగీకరించడంతో నటించాను. శంకర్‌కు తన కథపై నమ్మకం ఎక్కువ. భారతీయుడును నాతోనే తీయాలని పట్టుబట్టాడు. శంకర్ పట్టుదల చూసి నేను ఆశ్యర్చపోయాను. ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’ అని కమల్‌హాసన్ చెప్పారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
Also Read: Prabhas Fan: ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్.. షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్!
ఎస్ శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం భారతీయుడు 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. ఇందులో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జె సూర్య, బాబీ సింహ.. ఎంతో మంది స్టార్స్ నటించారు.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!