న్యూ ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో డా.కామాక్షి భాస్కర్ల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించడంతో నటి కామాక్షి భాస్కర్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై అద్భుత విజయం సాదించిన ‘మా ఊరి పొలిమేర 2’సినిమాలో లక్ష్మీ అనే పాత్రలో కామాక్షి అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమాను అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించారు .ఈసినిమాలో తన అద్భుతమైన నటనకుగానూ ఆమెకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు మరియు తనకు ఈ సూపర్ హిట్ మూవీలో అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలియజేసారు.
‘‘మా ఊరి పొలిమేర 2’ సినిమా తరుపున నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచిందని నటి కామాక్షి తెలిపింది. ఈ సందర్భంగా ఆమె తనకి నటన నేర్పిన రత్న శేఖర్‌గారికి మరియు నీజర్ కబిగారికి ధన్యవాదాలు తెలియజేసింది. నన్ను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ఈ అవార్డు అంకితం ఇసున్నట్లు కామాక్షి భాస్కర్ల తెలిపారు .