కళ్యాణ్ రామ్ కెరీర్‌లో నే బింబిసార సినిమా భారీ విజయం సాధించింది.నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమాలో సినిమాకు సీక్వల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు.బింబిసార 2 చిత్రం యొక్క అన్ని హక్కుల కోసం జీ సినిమా సుమారు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. రెండో భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నాడు. అయితే దర్శకుడు వశిష్ఠ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి స్క్రిప్ట్ చెప్పి ఆయనను ఒప్పించాడు. ఇది ఒక ఫాంటసీ సినిమా అని సమాచారం.చిరంజీవి ప్రాజెక్ట్ కనుక వర్క్ అవుట్ అయితే రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఇక్కడ ఒక లూప్ ఉంది.వశిష్ట తన రెండవ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కాకుండా మరొక ప్రొడక్షన్ హౌస్ తో చేస్తే తన రెండవ ప్రాజెక్ట్ యొక్క రెమ్యునరేషన్‌లో 40% వదులుకోవాలని ఒప్పందంపై సంతకం కూడా చేశాడు.
వశిష్ట బింబిసార 2 చేయడానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే చిరంజీవి సినిమా ఆయనకి భారీ అవకాశం.కళ్యాణ్ రామ్ తో మరో సినిమా అంటే మరోసారి సినిమాని హైప్ చేసుకోవాలి. కానీ తన రెమ్యూనరేషన్ వదులుకోవడానికి సిద్ధంగా అయితే లేడు. భవిష్యత్తులో మళ్ళీ ఎన్టీఆర్ ఆర్ట్స్‌కి సినిమా చేస్తానన్న ధీమాతో బింబిసార సినిమాను వదులుకుంటున్నట్లు సమాచారం.కానీ అందుకు కళ్యాణ్ రామ్ సిద్ధంగా లేడని తెలుస్తుంది.ఈ సమస్యను పరిష్కరించకుండా వశిష్ట-చిరంజీవిల సినిమా అయితే ప్రారంభం కాదు. వశిష్ట నిర్ణయంతో కళ్యాణ్ రామ్ కు కొద్దిగా కోపం వచ్చినట్లు తెలుస్తుంది.నేను ఆ దర్శకుడికి ఇచ్చిన ప్యాడింగ్ వల్లనే బింబిసార సినిమా విజయం సాధించింది. అతను ప్రాజెక్ట్ లో లేకపోయినా బింబిసార 2 కచ్చితంగా జరుగుతుంది” అని కళ్యాణ్ రామ్ భావించినట్లు సమాచారం.. ఇంతలో కళ్యాణ్ రామ్ బింబిసార 2 ను తెరకెక్కించడానికి రొమాంటిక్ సినిమా దర్శకుడు అనిల్ పాదూరిని సంప్రదించినట్లు సమాచారం.. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది