ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తాను వైసీపీ ముఖ్య నాయకులు అందరం కలిసి రోడ్డు షో నిర్వహించామని.. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. తప్పకుండా.. వైసీపీ ఎమ్మెల్యే…
మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపగడపకు తిరుగుతూ సౌమ్యుడు, స్నేహ శీలి, ప్రజాసేవకులు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.