Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra XEV 9S: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈవీల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఓ ఎలక్ట్రిక్ కారు బాలీవుడ్ తారలను మనసు దోచుకుంటుంది. ఏంటా కారు అని ఆలోచిస్తున్నారు. అదేనండి.. ‘మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్’ (Mahindra XEV 9S). ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ కొనుగోలు చేయగా, తాజాగా ఈ లిస్ట్‌లో దిగ్గజ నటుడు కబీర్ బేడీ సైతం చేరారు.
తమ గ్యారేజ్‌లోకి ఈ కొత్త కారు వచ్చి చేరిన ఆనందాన్ని కబీర్ బేడీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన కొత్త 7-సీటర్ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ కారుకు సాంప్రదాయబద్ధంగా పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఆధారంగా ఆయన ‘డెజర్ట్ మిస్ట్’ (Desert Mist) కలర్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ కారు రూబీ వెల్వెట్, నెబ్యులా బ్లూ, స్టెల్త్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
Also Read
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
- Renault Duster: లీటర్‌కు 19 కి.మీ మైలేజ్.. రెనాల్ట్ డస్టర్ కొత్త వేరియంట్‌పై కీలక అప్డేట్
- Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్‌లోపు కొనేయండి..
- TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
బ్యాటరీ, పవర్ సామర్థ్యం
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ కారు 59kWh, 70kWh, 79kWh వంటి మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవన్నీ కూడా డీసీ (DC) ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని సపోర్ట్ చేస్తాయి. అయితే వీటి ఛార్జర్ల పవర్ కెపాసిటీ వేర్వేరుగా ఉంటుంది. 59kWh బ్యాటరీ 231 హెచ్‌పీ (HP) పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని బేస్ వేరియంట్ ‘అరాయ్’ (ARAI) సర్టిఫైడ్ రేంజ్ లీటరుకు/సింగిల్ ఛార్జ్‌కు 521 కిలోమీటర్లుగా ఉంది. ఇది రేర్ వీల్ డ్రైవ్ (RWD) మోడ్‌తో వస్తుంది. ఇక, 79kWh బ్యాటరీ గరిష్టంగా 286 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. ఈ టాప్ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 679 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. ఇది సైతం రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తోనే పనిచేస్తుంది.
సెలబ్రిటీల హాట్ ఫేవరెట్
ఇక, మహీంద్రా నుంచి వస్తున్న అత్యధిక విక్రయాలు సాధిస్తున్న ఈవీ కార్ల జాబితాలో ఈ మోడల్ ముందు వరుసలో ఉంది. కబీర్ బేడీ కంటే ముందే ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ సైతం ఈ కారును కొనుగోలు చేశారు. వీరితో పాటు ఆకాంక్ష సింగ్, అనురాగ్ కశ్యప్, జావేద్ జాఫ్రీ, బోమన్ ఇరానీ, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వంటి ఎందరో ప్రముఖులు ఇప్పటికే మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లను సొంతం చేసుకున్నారు. విశాలమైన 7-సీటర్ లేఅవుట్, అత్యాధునిక ఫీచర్లు, ప్రీమియం లుక్, నమ్మకమైన రేంజ్ కారణంగా ఈ ఎస్యూవీ భారతీయ వాహనదారులను, ముఖ్యంగా సెలబ్రిటీలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!