Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్‌లోపు కొనేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: దేశంలోనే రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ‘టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్’ (TMPV) వాహన ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం కేవలం ఒక్క సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) ఇలా అన్ని రకాల మోడళ్లపై పడనుంది. తమ కార్ల ధరలను గరిష్టంగా 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కార్ల తయారీకి అయ్యే ఇన్పుట్ ఖర్చులు (ముడిసరుకు ధరలు) విపరీతంగా పెరిగిపోవడం, మార్కెట్లో ఉన్న ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. పెరిగిన ఖర్చుల భారాన్ని చాలా వరకు కంపెనీయే భరిస్తున్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో కొంత భాగాన్ని మాత్రమే ధరల పెంపు రూపంలో కస్టమర్లపై వేయాల్సి వస్తోందని కంపెనీ వివరించింది. అయితే, ఏ కారు ధర ఎంత పెరుగుతుందనే ఖచ్చితమైన వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు విడివిడిగా ఉంటుందని పేర్కొంది. ఒకవేళ మీరు టాటా కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే.. జూన్ 30 లోపు కొనుగోలు చేయడం ద్వారా ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చు.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ (EV), ఐసీఈ (ICE – ఇంటర్నల్ కంబస్చన్ ఇంజిన్) రెండు విభాగాల్లోనూ ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. దీని ప్రకారం.. పెట్రోల్, డీజిల్, సిఎన్జి విభాగాల్లో ఉన్న టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, సియెర్రా, హారియర్, సఫారీ కార్లను కొనాలంటే ఇకపై ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో ఉన్న టాటా టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి. కార్లు కొనాలనుకునే వారికి ఇది నిజంగా కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, జూన్ నెలాఖరు వరకు పాత ధరలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!