ఇటీవల “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ లో కనిపించిన సమంత అక్కినేని ఇప్పుడు “శాకుంతలం” అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. “శాకుంతలం” మహాభారతంలోని ఆది పర్వం, కాళిదాస్ “అభిజ్ఞాన శకుంతలం” ఆధారంగా తెరకెక్కుతోంది. సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ…