Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తిరువీర్, విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే **ఐశ్వర్య రాజేష్** జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..! సుకుమారి’. పల్లెటూరి వాతావరణంలో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా భరత్ దర్శన్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా మేకర్స్ అత్యంత వినోదాత్మకంగా సాగే టీజర్‌ను విడుదల చేసి అంచనాలను మరింతగా పెంచేశారు.
టీజర్‌ను గమనిస్తే.. పల్లెటూరి నేపథ్యం, స్థానిక రాజకీయాలు, ఒక వింతైన సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఊళ్లో ఎప్పుడూ రాజకీయాల చుట్టూ తిరుగుతూ, ఎలాంటి బాదరబందీ లేని ఓ యువకుడు.. తనకు కాబోయే భార్య చాలా సున్నితమైన మనసున్న ‘సుకుమారి’ అయి ఉండాలని కలలు కంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే అతనికి దామిని (ఐశ్వర్య రాజేష్) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిన హీరో, వెంటనే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేస్తాడు. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయిని ఎవరు ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుంది! ఈ వింతైన సమస్య వల్ల ఆ కుర్రాడి జీవితంలో, ఊళ్లో ఎలాంటి హాస్యభరితమైన పరిస్థితులు తలెత్తాయనేది దర్శకుడు భరత్ దర్శన్ చాలా ఫన్నీగా చూపించినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఒక మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేయడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-సౌత్ చిత్రంగా ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?