YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీగా ప్రచారం చేసిన నియామక ప్రక్రియ వాస్తవానికి “మెగా స్కామ్”గా మారిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుట్ర కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని విమర్శించారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీలో పారదర్శకత పూర్తిగా దెబ్బతిందని, నియామక ప్రక్రియపై అనేక అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
భద్రతా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపణ
డీఎస్సీ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థాగత భద్రతా వ్యవస్థలను కావాలనే నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గోప్యమైన బాధ్యతలు అప్పగించడం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో భాగమైన ఒక ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ సాధించడం పేపర్ లీక్‌కు నిదర్శనమని ఆరోపించారు.
Also Read
మెరిట్ లిస్ట్, ఫలితాలపై అనుమానాలు
డీఎస్సీ మెరిట్ లిస్టులో మార్పులు జరిగాయని, కొంతమంది అభ్యర్థుల పేర్లు తొలగించబడినట్లు ఆరోపణలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో పూర్తి పారదర్శకత పాటించలేదని విమర్శించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా కొందరు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితాలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మరోవైపు.. స్పోర్ట్స్ కోటా విధానాన్ని నియామకాల కోసం మార్చి, తర్వాత మళ్లీ పాత విధానానికే తీసుకురావడం వెనుక అనేక ప్రశ్నలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో బ్యాక్‌డోర్ ఎంట్రీలకు అవకాశం కల్పించారని విమర్శించారు.
డబ్బుల బేరసారాల ఆరోపణలు
టీచర్ పోస్టుల నియామకాల కోసం డబ్బుల బేరసారాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్ అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారని ఆరోపించారు.
సీబీఐ దర్యాప్తే మార్గం
డీఎస్సీ నియామకాల వ్యవహారం భారీ అవినీతి కుంభకోణంగా మారిందని జగన్ ఆరోపించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!