ఆన్‌లైన్ గేమింగ్ కు సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు చెల్లించాల్సిన పన్ను బాకీలు దాదాపు 45,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 11న ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017కి సవరణలు కోరుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా 2017 నుంచి పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐటీ) ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల పన్నుల మదింపు చేసింది. దీని ద్వారా 28 శాతం జీఎస్టీ చెల్లించకుండా కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించినవని వాదించగా నైపుణ్యం ఆధారిత గేమింగ్స్‌కు 18 శాతం జీఎస్టీని వసూలు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో పన్నును అవకాశం ఆధారితంగానా లేక నైపుణ్యం ఆధారితంగా వర్గీకరించాలా అన్నదానిపై చాలా కాలం చర్చ జరిగింది.
పైన పేర్కొన్న విధంగా కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించి వాదించి కేవలం 18 శాతం జీఎస్టీని మాత్రమే చెల్లించాయి. అయితే ఈ మధ్యే పార్లమెంట్ ఈ బిల్లును సవరించడంతో అవి కూడా మొత్తం 28 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన చూస్తే న్‌లైన్ గేమింగ్ సంస్థలు దాదాపు రూ. 45,000 కోట్లు బకాయి పడినట్లు కేంద్రం తెలిపింది.
Also Read: Diesel instead of Petrol: కారులో పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించారా? ఇలా చేయండి
ఇక నుంచి క్యాసినో, పందెలు వేసే సంస్థలు, ఆన్‌లైన్ గేమింగ్ అన్ని సంస్థలు కచ్ఛితంగా 28 శాతం పన్ను కట్టాల్సిందే. 28 శాతం ప్రకారం పన్ను కట్టాలని తెలియజేస్తూ మిగిలిన బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ కేంద్రం ఆ కంపెనీలకు నోటీసులు జారీ చేయనుంది. లోక్ సభలో చేసిన బిల్లు సవరణలకు అనుగుణంగా ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు నిర్దేశించిన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.