బిజినెస్ పార్ట్‌నర్‌ను హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. యెమెన్ సర్కారు మరో నాలుగు రోజుల్లో (జులై 16) ఉరిశిక్షను అమలు చేయబోతుంది. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని ప్రియ 2017లో హత్య చేయగా.. 2020లో మరణశిక్ష విధించారు. ఫైనల్ అప్పీల్ 2023లో రిజెక్ట్ కాగా.. ఈ నెల 16న ఉరితీయబోతున్నారు. నిమిష ప్రియ ఉరిశిక్షపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని కోరారు.
కేఏ పాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ‘యెమెన్‌లో ఇండియన్ నర్స్ ప్రియను రక్షించాలి. కేరళ నర్స్ ప్రియకు క్షమాభిక్ష పెట్టాలి. క్షమాభిక్ష కోసం యెమెన్ ప్రధానిని కోరుతూ లేఖ రాశాను. జూలై 16న మరణశిక్ష నుంచి తప్పించాలి. ప్రియ ఎన్నో కష్టాలు పడింది. ప్రియ పార్టనర్ ఆమెకు నరకం చూపించాడు. ఎలా తప్పించుకోవాలో అర్థo కాక అతన్ని ప్రియ హత్య చేసింది. ప్రియ చేసిన హత్యను ఖండిస్తున్నా కానీ.. ఆమెకు క్షమాభిక్ష పెట్టాలి. యెమెన్ ప్రెసిడెంట్‌కి శాంతి బహుమతి ఇస్తాం. శాంతి బహుమతి కోసం నామినేట్ చేస్తాం. మహిళలకు ఈ దేశంలోనూ రక్షణ లేదు. ఇక్కడ ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్లి వెట్టి చాకిరి చేస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Joe Root-Sachin: దిగ్గజాలను మించేలా జో రూట్.. అప్పుడే సచిన్‌కు దగ్గరగా వచ్చేశాడు!
అమెరికాలో కొత్త పార్టీపై కేఏ పాల్ మాట్లాడుతూ… ‘అమెరికాను కాపాడాలంటే మూడో పార్టీ కావాలి. ఆల్ అమెరికన్ పార్టీపై అందరి చూపులు ఉన్నాయి. గతంలో అమెరికాలో ఉన్న అందరితో కలిసి కొత్త పార్టీ పెట్టాలని ప్రపోజ్ చేశాను. ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయి. మూడో పార్టీ అవసరం ఉంది. మూడో పార్టీ పెట్టీ తీరుతాం. మస్క్ వద్ద డబ్బు ఉంది.. నాకు ఫాలోయింగ్ ఉంది. కానీ ట్రంప్తో డీల్ కుదిరితే మస్క్ మళ్లీ వెనక్కి వెళ్తాడు. అమెరికాలో నా కొడుకును సిద్ధం చేస్తున్నా. అక్కడే పుట్టి పెరిగాడు. నా కొడుకు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలని కోరిక’ అని తెలిపారు.