రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలు అవాస్తవాలు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను నీరు గార్చింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికిరా., కులాల ఆధారంగా రిజర్వేషన్ లు వద్దని నెహ్రూ అప్పటి సిఎం లకు లేఖ రాసిన మాట వాస్తవమా కాదా అంటూ వ్యాఖ్యానించాడు. రాజీవ్ గాంధీ బీసీలకు 27% రిజర్వేషన్ లు వ్యతిరేకించింది వాస్తవమా కాదా., భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలి. దేశంలో 2 సిద్దాంతాల మధ్య…
శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఇవాళ శుక్రవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా లు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. తెలంగాణలో రామరాజ్యం రావటానికి ఏడాది మాత్రమే వుందని, ఇది ఖాయమని బీజేపీ…
బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి…
దక్షిణాదిలో తెలంగాణలో కూడా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ అగ్రనాయకత్వం.. రాష్ట్రంపై అన్నిరకాల ఎఫర్ట్స్ పెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది గోల్. ఆపై లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడున్న నాలుగు సీట్లే కాకుండా మరిన్నిచోట్ల పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలు తరచుగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌కు ప్రధాని మోడీ వచ్చారు. ఆయన నగరంలో ఉన్నది కొద్ది గంటలే అయినప్పటికీ.. అందులో పార్టీకి కూడా సమయం కేటాయించారు. రాష్ట్రంలో…