RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC17 Movie: గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 కోసం చిత్రబృందం నటీనటుల వేట ప్రారంభించింది. ఈ సినిమాలో నటించాలని అనుకునేవారికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ మేకర్స్ అధికారికంగా ఆడిషన్స్‌కు పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారికి ఈ ఆడిషన్స్‌లో అవకాశం కల్పిస్తున్నట్లు చితబృందం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.
కొత్త ప్రపంచం.. సరికొత్త కథ.. అందులో మీకో పాత్ర ఎదురుచూస్తుంది అంటూ క్యాస్టింగ్ ప్రకటనను పంచుకున్నారు. ఈ మూవీలో నటించాలనుకునేవారు తమ ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com మెయిల్‌కు పంపించాలని సూచించారు. అలాగే, మరిన్ని వివరాల కోసం 9110564651 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇకపోతే, గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో మరోసారి ఈ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, RC17 ఆడిషన్స్ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ లోనే కాకుండా నటనపై ఆసక్తి ఉన్న యువతలోనూ ఉత్సాహం మొదలైంది.
Also Read
- KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
- Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
- January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
- Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్
-
Lok Sabha Seats Increase: లోక్‌సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
-
KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
-
Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
-
Deepam Row: విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. సీఎస్, డీజీపీ సహా 15 మందికి ధిక్కరణ నోటీసులు!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!