Lok Sabha Seats Increase: లోక్‌సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Seats Increase: ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది.. ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.. దక్షిణ భారత దేశంలోని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ చేయదలచిన విధానాన్ని తప్పుబడుతున్నారు.. అయితే, దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు డీలిమిటేషన్ ప్రక్రియ తెరలేపనుందా? అంటే అవుననే సంకేతాలు వచ్చేశాయి.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలతో ముందుకు సాగుతోంది. డీలిమిటేషన్ బిల్లులో కీలక సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలకు అదనంగా 270 స్థానాలు పెరుగుతాయని చర్చ సాగుతోంది.. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 813కు చేరనుంది. రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల నిష్పత్తిని నిర్ణయించేందుకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకునే గడువును మరో 25 ఏళ్లు పొడిగించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళనలకు పరిష్కారంగా నిలుస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక, తాజాగా ప్రతిపాదించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు ద్వారా ఈ గరిష్ఠ పరిమితిని 850కి పెంచాలని కేంద్రం భావిస్తోందనే సమాచారం కూడా ఉంది.. ఇందులో రాష్ట్రాలకు గరిష్ఠంగా 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే ప్రతిపాదన ఉందట.. ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యతో పోలిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం పెంపు చేపట్టాలన్నది ప్రధాన ప్రతిపాదనగా ఉంది.
రాష్ట్రాల వారీగా పెరగనున్న లోక్‌సభ స్థానాలు
ప్రతిపాదిత జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం కలిపి ఉన్న 42 లోక్‌సభ స్థానాలు 63కు పెరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 2 స్థానాలు యథాతథంగా కొనసాగనున్నాయి. అసోంలో 14 నుంచి 21కు, బీహార్‌లో 40 నుంచి 69కు, ఛత్తీస్‌గఢ్‌లో 11 నుంచి 17కు పెరగనున్నాయి. గోవాలో 2 స్థానాలు మార్పు లేకుండా ఉంటాయి. ఇక, గుజరాత్లో ప్రస్తుతం ఉన్న 26 స్థానాలు 40కు, హర్యానాలో 10 నుంచి 17కు, హిమాచల్ ప్రదేశ్‌లో 4 నుంచి 5కు పెరగనున్నాయి. జమ్మూ కశ్మీర్, లడఖ్ కలిపి ప్రస్తుతం ఉన్న 6 స్థానాలు 8కు చేరనున్నాయి. జార్ఖండ్‌లో 14 నుంచి 22కు, కర్ణాటకలో 28 నుంచి 41కు పెరగనున్నాయి.
Also Read
- Deepam Row: విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. సీఎస్, డీజీపీ సహా 15 మందికి ధిక్కరణ నోటీసులు!
- Supreme Court: రేపు దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందే.. ఆలయ ట్రస్టీలపై సుప్రీంకోర్టు వేటు!
- Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
- Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్!
కేరళలో ప్రస్తుతం ఉన్న 20 స్థానాలు 22కు, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 48కు, మహారాష్ట్రలో 48 నుంచి 75కు పెరగనున్నాయి. మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 2 స్థానాలు చొప్పున యథాతథంగా కొనసాగనున్నాయి. మిజోరం, నాగాలాండ్‌లలో ఒక్కో స్థానం మాత్రమే ఉండనుంది. ఒడిశాలో 21 నుంచి 28కు, పంజాబ్‌లో 13 నుంచి 19కు, రాజస్థాన్‌లో 25 నుంచి 46కు లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. సిక్కింలో ప్రస్తుతం ఉన్న ఒక్క స్థానం మార్పు లేకుండా కొనసాగుతుంది. తమిళనాడులో 39 నుంచి 48కు, త్రిపురలో 2 స్థానాలు యథాతథంగా ఉండనున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 80 లోక్‌సభ స్థానాలు 133కు పెరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో 5 నుంచి 7కు, పశ్చిమ బెంగాల్లో 42 నుంచి 61కు పెరగనున్నాయి. ఢిల్లీలో 7 స్థానాల నుంచి 11కు పెంపు ప్రతిపాదన ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ప్రస్తుతం ఉన్న ఒక్కో లోక్‌సభ స్థానం యథాతథంగా కొనసాగనున్నట్లు ప్రతిపాదిత జాబితాలో పేర్కొన్నారు.
543 నుంచి 813కు.. మొత్తం 270 స్థానాలు అదనం
ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలకు అదనంగా 270 స్థానాలు చేరనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భారీగా స్థానాలు పెరగనున్నాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 42 నుంచి 63కు, కర్ణాటక 28 నుంచి 41కు, తమిళనాడు 39 నుంచి 48కు, కేరళ 20 నుంచి 22కు పెరగనున్నట్లు చర్చ సాగుతోంది.. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనతో పాటు రాష్ట్రాల వారీగా ఎంపీ స్థానాల కేటాయింపులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం, దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lok Sabha Seats Increase: లోక్‌సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
-
KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
-
Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
-
Deepam Row: విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. సీఎస్, డీజీపీ సహా 15 మందికి ధిక్కరణ నోటీసులు!
-
Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!