Judge Frank Caprio: ఓ న్యాయముర్తి తన తీర్పులతో కేవలం తన దేశ ప్రజల హృదయాలను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాల మనసులను గెలుచుకున్నారు. ఆయనే అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో. ఆయన తన 88 ఏళ్ల వయసులో మరణించారని వారి కుటుంబం సోషల్ మీడియాలో ప్రకటించింది. మీరు సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నట్లైతే ఏదో ఒక సందర్భంలో, ఆయన మీకు కచ్చితంగా కనిపించే ఉంటారు. ఎందుకంటే ఆయన తన కోర్టులో విధించిన తీర్పులు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఆయన కేవలం తీర్పు చెప్పే విధానంతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించారు. ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Cyber Crime: 81 ఏళ్ల వృద్ధుడిని వాట్సాప్ కాల్ ద్వారా హనీ ట్రాప్.. రూ. 7 లక్షలు స్వాహా
పాపులారిటీ తీసుకువచ్చిన రియాలిటీ టీవీ షో
అమెరికాలోని రోడ్ ఐలాండ్‌కు చెందిన న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు న్యాయమూర్తిగా పనిచేసి, 2023లో పదవీ విరమణ చేశారు. ఈ సమయంలో ఆయన చిన్నచిన్న ఉల్లంఘనలు లేదా తప్పులపై వెలువరించిన తీర్పులతో సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందారు. 2000 సంవత్సరంలో వచ్చిన రియాలిటీ టీవీ షో “కాట్ ఇన్ ప్రావిడెన్స్” లో ఆయన చెప్పిన తీర్పులు జనాల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ షోలో ఆయన ట్రాఫిక్ ఉల్లంఘనలకు, ర్యాంగ్ ప్లేస్‌లో వాహనాలను పార్కింగ్ చేసినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వారితో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఈ షో క్లిప్‌లు సోషల్ మీడియాలో మిలియన్ల సార్లు వీక్షించబడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి గొప్పవారని తెలుసుకోడానికి. ఆయన తరచుగా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు జరిమానాలను మాఫీ చేస్తున్నట్లు, వారి తల్లిదండ్రుల శిక్షలను నిర్ణయించడంలో సహాయం చేయమని పిల్లలను కోరినట్లు ఈ వీడియోలలో కనిపిస్తాయి.
ఆయన 1936లో జన్మించారు. ఆయన న్యాయమూర్తి కావడానికి ముందు వార్తాపత్రికలను పంపిణీ చేయడం వంటి అనేక ఉద్యోగాలు చేశారు. తర్వాత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, రాత్రి సమయంలో బోస్టన్‌లోని సఫోల్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చదువుకున్నారు. తర్వాత 1985 నుంచి 2023 వరకు మున్సిపల్ కోర్ట్ ఆఫ్ ప్రావిడెన్స్‌కు చీఫ్ జడ్జిగా ఆయన పనిచేశారు.
సోషల్ మీడియాలో ఆయనకు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. వారు ఆయనను ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయమూర్తిగా కొనియాడారు. తన తీర్పులతో ఆయన కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నారు.
READ MORE: ₹1 crore lottery story: ముప్పై రూపాయలతో కోటీశ్వరుడు.. అదృష్టం అంటే ఇదే..!