Site icon NTV Telugu

Jubilee Hills Bye-Election: ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఇప్పటివరకు ఎన్ని దాఖలయ్యాయంటే..?

Jubilee Hills By Election

Jubilee Hills By Election

Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ తరఫున నవీన్‌ యాదవ్‌ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి సునీత‌ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదే పార్టీ నుంచి పి. విష్ణు వర్ధన్‌ రెడ్డి డమ్మీ నామినేషన్‌ వేశారు.

READ MORE: Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి తరఫున ఆయన భార్య నామినేషన్‌ దాఖలు చేశారు. దీపక్‌ రెడ్డి ఈరోజు మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 63 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు 25 రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు సమర్పించారు. రేపు అధికారులు నామినేషన్ల పరిశీలనను చేపట్టనున్నారు. ఈనెల 24వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

READ MORE: NTRNeel : షూటింగ్ కు బ్రేక్ దర్శకునికి.. హీరోకి చెడిందా.?

Exit mobile version