Hyderabad: సరోజినీ దేవి హాస్పిటల్లో బాణాసంచా కాలుస్తూ గాయపడిన వారి సంఖ్య వరుసగా పెరుగుతోంది. ప్రస్తుతం 70 మందికి పైగా బాధితులు చేరారు. ఇందులో 20 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది వీరిలో ఇద్దరినీ ఇన్ పేషెంట్ గా చేర్చుకుంది. అవసరమైతే రేపు చికిత్స నిమిత్తం సర్జరీ చేసే అవకాశం ఉంటుందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను కలిశారు. రోగుల సంఖ్య, వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత కుటుంబీకులను సైతం కలిశారు.
READ MORE: Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది
దీపావళి ఎంత కాంతిని ఇస్తుందో… వికటిస్తే అంతే చీకటినీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రమాదాలేవీ లేకుండా కేవలం వేడుకల సంబరాలు పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అందరూ పాటించాలి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. చాలా ఎక్కువ తీక్షణమైన వెలుగు, దానితోపాటు వెలువడే వేడిమి, మంట… ఈ మూడు అంశాలతో కళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని రసాయనాలతో కళ్లు పరోక్షంగా ప్రభావితం కావచ్చు. సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి.
READ MORE: Nizamabad: సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అంత్య క్రియలు పూర్తి..