కుల గణన, మూసి ప్రక్షాళనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ భేటీలో చర్చ జరిగింది. మూసి ప్రక్షాళనపై సీఎంతో గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు సీఎం ఆయనకు తెలిపారు.
Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు.