మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందున, ఈ స్టార్-స్టడడ్ ప్రాజెక్ట్ కోసం అంచనాలు భారీగా ఉన్నాయి, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, ఆకట్టుకునే డ్రామా బ్లెండ్ గా ఉంటుంది. అజిత్ ని క్రేజీ అవతార్‌లో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 10, 2025న విడుదలవుతున్న ఈ చిత్రం వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో, అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు.
Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్..
చేతిలో తుపాకీతో సోఫాలో కూర్చున్న అతను, ఇంటెన్సిటీ , సస్పెన్స్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ అందిస్తానని హామీ ఇచ్చారు. మార్క్ ఆంటోని విజయం తర్వాత, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో నైపుణ్యం కలిగిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్‌ను మల్టీ -లేయర్డ్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు.ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్ సునీల్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్ అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను విజయ్ వేలుకుట్టి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను జి ఎం శేఖర్ పర్యవేక్షిస్తున్నారు. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించగా త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.