ఈ మధ్య ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోతున్నారు.. జనాలు ఉన్నారన్న సంగతి కూడా మరచి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా పనిష్మెంట్స్ ఇచ్చారు.. అయిన ఎక్కడో చోట ప్రేమికులు హద్దులు మీరుతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట ప్రవిత్రమైన దేవాలయంలో పాడు పని చేస్తూ అడ్డంగా దొరికారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి ఓ ఆలయంలో అమ్మాయి, అబ్బాయి పాడు పని చేస్తూ..అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరూ గుడి పరిసర ప్రాంతంలో అభ్యంతకరంగా ఉండగా.. స్థానికులు పట్టుకున్నారు. అబ్బాయి, అమ్మాయితో పాటు.. వారి స్నేహితుడొకరిని కూడా పట్టుకున్నారు గ్రామస్తులు. ఆ ముగ్గురుకి తమదైన శైలిలో గుణపాఠం చెప్పారు. మీ గలీజ్ పనికి గుడి తప్ప చోటే దొరకలేదా? అంటూ చెంపలు పగలగొట్టారు.. అంతేకాదు అక్కడకు వచ్చిన వారంతా దేహశుద్ధి చేశారు..
ఆ జంట తమను క్షమించమని ఎంతగా వేడుకున్నప్పటికీ.. వదిలిపెట్టలేదు. ధన్‌బాద్‌లో ని నిర్సా నయాదంగ కాళీ టెంపుల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టుబడిన ప్రేమ జంటను మోకాళ్లపై కూర్బోబెట్టి తిట్టారు స్థానికులు. ఈ సీన్ అంతటిని మరొకరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. క్షమించమని వేడుకున్నా, కాళ్లు పట్టుకుని ప్రాథేయపడినా గ్రామస్తులు వారి చర్యను ఉపేక్షించలేదు.. అయితే,ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రేమ జంట తీరును తప్పుపడుతున్నారు.. మరికొందరు వారిని వెంటనే పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఎక్కడ దొరకలేదా ఇలాంటి గుడిలో కూడా వదలకుండా కానిస్తున్నారు.. సిగ్గు లేదా కనీసం అంటూ బండ బూతుల తో కామెంట్స్ చేస్తున్నారు