జాన్వీ నారంగ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ వారసురాలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని అందుకుంది.. అతి చిన్న వయస్సులోనే వినోద పరిశ్రమలోకి ప్రవేశించి ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.. తాజాగా ఈమె అత్యంత ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ అవార్డును అందుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
జాన్వీ నారంగ్ ఆసియా సినిమాల్లో అనేక ఆవిష్కరణలకు సూత్రధారి. వారి మల్టీప్లెక్స్ చైన్ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, వారు ప్రొడక్షన్ మరియు ఎగ్జిబిషన్ వ్యాపారంలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తమ నిర్మాణ సంస్థ లాభాలను పెంచేందుకు, ఈ నిర్మాణంలో వినోదబరితమైన సినిమాలను అందించేందుకు కృషి చేస్తున్నారు..
తాజాగా ఆమె చేస్తున్న సేవలకు గానూ ఆమెకు ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు లభించింది. ఈ అతి చిన్న వయస్సులో ఆమె సాధించిన విజయాలు కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆమె తీసుకున్న సంకల్పానికి నిదర్శనం.. నిర్మాణ సంస్థ భాధ్యతలను దగ్గరుండి చూసుకుంటుంది.. ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన కుబేర చిత్రం నిర్మాణ దశలో ఉంది.. దీంతో పాటుగా మరికొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి..