కోర్ట్ సినిమా సక్సెస్ తర్వాత హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ వంటి పవర్‌హౌస్ టీంతో కలిసి ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్‌పై…
జాన్వీ నారంగ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ వారసురాలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని అందుకుంది.. అతి చిన్న వయస్సులోనే వినోద పరిశ్రమలోకి ప్రవేశించి ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.. తాజాగా ఈమె అత్యంత ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ అవార్డును అందుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. జాన్వీ నారంగ్ ఆసియా సినిమాల్లో అనేక ఆవిష్కరణలకు సూత్రధారి.…
ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్ దాస్ నారంగ్ ఇటీవల పరమపదించారు. ఆరంభం నుంచి చిత్రపరిశ్రమతో మమేకమై సాగిన తండ్రి మృతి సునీల్ కి ఆశనిపాతమే. ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడుగా కూడా చేసిన నారాయణదాస్ అడుగుజాడలలోనే అటు పంపిణీ రంగంలో, ప్రదర్శనరంగంలో తనదైన ముద్రవేసి ఇప్పుడు నిర్మాణంలో కూడా అడుగు పెట్టాడు సునీల్. తండ్రి దూరమైన ఖేదంలో ఉన్న సునీల్ కి మోదాన్ని కలిగించింది కుమార్తె జాన్వీ నారంగ్. లండన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో బిజినెస్…