Jeevitha Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెలు శివాత్మిక, శివాని ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమ పిల్లల గురించి మాట్లాడుతూ జీవిత కొంత భావోద్వేగానికి గురయ్యారు. దొరసాని సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు.
Read Also: Puri Jagannadh: పూరి జగన్నాథ్ జీవితంలో సగం రోజులు గొడవలేనట
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలోనే పెరిగారని ఆమె తెలిపారు. సినిమాల్లోకి వస్తామని వాళ్లు చెప్పగానే తనకు, రాజశేఖర్ కు విపరీతమైన టెన్షన్ వచ్చిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి అయినా సరే కొనిచ్చామని… అయితే సినిమాల్లో రాణించడం అంత సులభం కాదని, అందుకే టెన్షన్ పడ్డామని తెలిపారు. సినిమాల్లో మంచి పాత్రలు లభించడం, ఫేమ్ రావడం అనేది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని… డబ్బుతో వీటిని కొనలేమని… అందుకే తమ అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డామని చెప్పారు. అయితే, వాళ్ల ఇష్టాలను గౌరవించి సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.