Jeevan Reddy : పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి
- "పార్టీ మారే ప్రసక్తే లేదు" – ఊహగానాలకు బ్రేక్ వేసిన జీవన్ రెడ్డి
- "నా సీనియారిటీకి గౌరవం లేదు, కానీ కాంగ్రెస్‌నే వదలను" – అసంతృప్తి వెలిబుచ్చిన జీవన్
- "చివరి 40 ఏళ్ళుగా నేను అంటే కాంగ్రెస్" – తన పాత్రను గుర్తుచేసిన జీవన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతారన్న ఊహగానాలను కొట్టి పడేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి… వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీని వీడనని ఆయన తెలిపారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు కాబట్టి అసంతృప్తితోనే ఉన్నానని, 2014లో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేనొక్కడినే శాసనసభ్యుడిని అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ అంటే నేను.. నేను అంటే కాంగ్రెస్ గా పార్టీ ని బలోపేతం చేశా అని ఆయన వెల్లడించారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ నిరంకుశ ప్రజాస్వామ్య పాలన లో నేను ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా ఒంటరిగా పోరాడానని, పార్టీ ఆలోచన మేరకు రెండుసార్లు కేసీఆర్ పై పోటీ చేశానన్నారు. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు లు మంత్రి పదవులు ఆశించడం లో తప్పు లేదన్నారు జీవన్ రెడ్డి.
Rekha Gupta: స్కూల్ ఫీజుల పెంపుపై సీఎం ఆగ్రహం.. అవసరమైతే స్కూళ్లు రద్దు చేస్తామని వార్నింగ్
Also Read
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?