Crime news: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేతుల్ జిల్లాకు చెందిన శివకుమార్ రాథోడ్ మూడేళ్ల క్రితం పూజ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శివకుమార్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. అయితే, పూజకు గుట్కా తినే అలవాటు ఉంది. దీంతో ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమె గుట్కా తీసుకుంది. ఇక, ఈ విషయం తెలిసిన భర్త శివకుమార్.. గుట్కా కావాలంటే తనను అడగొచ్చు కదా? అని పూజను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Read Also: TSRTC: రికార్డు బద్దలు కొట్టిన టీఎస్ ఆర్టీసీ.. ఆ ఒక్క రోజే రూ. 12 కోట్ల ఆదాయం
అనంతరం శివకుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లి పీలక దాకా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ భార్యతో గుట్కా విషయంలో గొడవ పడ్డాడు. ఈ గొడవ మరింత తీవ్రం కావడంతో సమీపంలో ఉన్న తన సోదరుడికి పూజ సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పూజ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. పోలీసులు చేరుకునే లోపే శివ కుమార్ బ్లేడ్ తో గొంతు, మణికట్టు కోసుకున్నాడు.. దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న శివకుమార్ ను ఆదివారం అర్థరాత్రి చికిత్స కోసం పోలీసులు బేతుల్ జిల్లా ఆస్సత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.