JC Prabhakar Reddy: అనంతపురం అభివృద్ధికి మేయర్ పార్టీ మారాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలను ఎదుర్కొని తాను ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే వైసీపీ నాయకులని మండిపడ్డారు.
అనంత వెంకట్రామిరెడ్డికి కళ్లకు కనిపించడం లేదా?
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంత వెంకట్రామిరెడ్డికి కళ్లు దొబ్బాయా? అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ప్రజలు కొడతారంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం పట్టణం అభివృద్ధి చెందాలంటే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి అనంత వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నుంచి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అడుగుతున్న ఆయన.. ముందుగా వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలు జరిగిన సమయంలో చంద్రబాబు పోటీ చేయవద్దని చెప్పినా తాను వెనక్కి తగ్గలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆ పరిస్థితులను ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. తమిళనాడు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకొచ్చి కుప్పంలో ఓట్లు వేయించుకుని గెలిచినప్పుడు వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం లేకపోతే సింగనమలలో రెండు జడ్పీటీసీ స్థానాలు ఎలా వచ్చాయో శైలజానాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
- Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
- Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టారని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ‘రప్పా రప్పా నరికేస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతారా? అని ప్రశ్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి వాటి రూపురేఖలు మార్చాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి మాట్లాడటం కూడా వృథా అని వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతి గ్రామానికి తాగునీరు అందుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎల్లమూరు, పుట్లూరు మండలాల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు. 2021 ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఇప్పుడు కూడా అప్పటిలాగే పోలీసులు వ్యవహరించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని వ్యాఖ్యానించారు.
మేయర్ రమేష్ గౌడ్ పార్టీ మారితేనే అభివృద్ధి!
అనంతపురం నగర అభివృద్ధిపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం మేయర్‌గా గెలిచిన రమేష్ గౌడ్ పార్టీ మారితేనే నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం మేయర్ మాటను కమిషనర్‌తో పాటు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో తాను మున్సిపల్ చైర్మన్‌గా గెలిచినప్పుడు కూడా తాడిపత్రిలో అధికారులు తన మాట వినలేదని, ఆ బాధను స్వయంగా అనుభవించానని గుర్తుచేశారు. అనంతపురం నగరం అభివృద్ధి చెందాలంటే వైసీపీ మేయర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులంతా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలను కలవాలని సూచించారు. అలా చేయకపోతే నగర అభివృద్ధికి అవసరమైన నిధులు వచ్చే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. ఇక, ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నాయకులు మాట్లాడితే ప్రజలు వారి ఇళ్ల ముందుకు వచ్చి నిలదీస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వైసీపీ నేర్పిస్తే తాము కూడా నేర్చుకున్నామని వ్యాఖ్యానిస్తూ.. ఇకపై వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడొద్దని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!