Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jasprit Bumrahs Interesting Comments On The Captaincy Of Dhoni Kohli Rohit

Jasprit Bumrah: ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

Published Date :August 19, 2024 , 8:24 pm
By Rajesh Veeramalla
  • ధోనీ.. కోహ్లీ.. రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
  • ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన స్టార్ బౌలర్.
Jasprit Bumrah: ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుపై ప్రభావం చూపి ఆటగాళ్లను ఎలా తయారో చేశారో చెప్పాడు. ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో బుమ్రా కూడా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. అటు.. రోహిత్ నాయకత్వంలో స్వేచ్ఛగా ఆడే స్వేచ్ఛ లభించింది. రోహిత్ కెప్టెన్సీలో బుమ్రా ముంబై ఇండియన్స్‌కు కూడా ఆడిన సంగతి తెలిసిందే.

Read Also: UP video: స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

రోహిత్ గురించి బుమ్రా ఏం అన్నాడంటే..?
ఆటగాళ్లతో భావోద్వేగ స్థాయిలో కనెక్ట్ అవుతాడని.. వారి ఆలోచలను అర్థం చేసుకుంటాడని రోహిత్‌ను ప్రశంసించాడు. రోహిత్ కెప్టెన్సీ గురించి బుమ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ బౌలర్ల పట్ల సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్లలో రోహిత్ ఒకడని అన్నాడు. రోహిత్ రిజిడ్ కాదు, రియాక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు.

ధోనితో తన అనుభవాలు
2011 ప్రపంచ కప్‌తో సహా అనేక చిరస్మరణీయ విజయాలను భారత్‌కు అందించిన ధోనీ కెప్టెన్సీలో బుమ్రా తన అనుభవాలను కూడా పంచుకున్నాడు. తనకు ధోనీ చాలా భద్రత కల్పించాడని తెలిపాడు. అతను తన ప్రవృత్తిపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాడన్నాడు. ఓవర్ ప్లానింగ్‌ను నమ్మడని చెప్పాడు. ఆ నమ్మకమే అతనిని అంతర్జాతీయ స్థాయిలో రాణించిందని బుమ్రా పేర్కొన్నాడు.

కోహ్లీ ఇప్పటికీ నాయకుడిగా ఉన్నాడు
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా జట్టు ఫిట్‌నెస్ ప్రమాణాలను మార్చడానికి.. తన నాయకత్వ ఉనికిని కొనసాగిస్తునందుకు కోహ్లీని బుమ్రా కొనియాడాడు. విరాట్ శక్తివంతంగా, ఉద్వేగభరితంగా, దూకుడుగా ఉంటాడని బుమ్రా చెప్పాడు. కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ కాదు కానీ.. ఇప్పటికీ నాయకుడిగా కొనసాగుతున్నాడని బుమ్రా తెలిపాడు.

బౌలర్లకు నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి
బుమ్రా భారత టెస్ట్, టీ20 జట్లకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. బౌలర్‌లకు ప్రత్యేకమైన నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తన కెప్టెన్సీ గురించి బుమ్రా మాట్లాడుతూ.. ‘బౌలర్లు తెలివైనవారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేస్తారు. మనం మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు సాధారణంగా బ్యాట్స్‌మెన్‌పై నిందలు వేస్తారు. కాబట్టి ఇది కష్టమైన పని. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ మరియు వకార్ యూనిస్ వంటి కెప్టెన్లు కూడా బౌలర్లేనని తెలిపాడు. కపిల్ దేవ్ భారత్ కు ప్రపంచకప్ అందించాడు అని అన్నాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ అందించాడు. అందుకే బౌలర్లు తెలివైనవారని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • captaincy
  • cricket
  • Interesting comments
  • Jasprit Bumrah
  • ms dhoni

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions