AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్లో, జనసేన పార్టీ 32 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లయింది.
120 వార్డులకు 1,623 నామినేషన్లు
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు మొత్తం 1,623 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున 493, జనసేన పార్టీ తరఫున 266, భారతీయ జనతా పార్టీ తరఫున 90 నామినేషన్లు నమోదయ్యాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 359 నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 287 నామినేషన్లు వచ్చాయి. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆశించిన స్థానాలు దక్కని నాయకులు, ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలు అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కూటమి పార్టీలు అభ్యర్థుల జాబితాలను అధికారికంగా ప్రకటించకుండానే కొందరికి నేరుగా బీ ఫారాలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది.
Also Read
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవిపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది ఉన్నట్లు సమాచారం. కూటమి పార్టీల్లో సీట్ల పంపకం పూర్తవడంతో పాటు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారు, మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎవరికి ఉంటుందన్న అంశాలపై విశాఖ రాజకీయాల్లో చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!