Janhvi Kapoor Tamil Debut: జాన్వీ కపూర్‌కి గోల్డెన్ చాన్స్.. కోలీవుడ్ యువ హీరోతో సినిమా! నిర్మాత కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor to Act with Praddep Ranganathan in Tamil: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా ‘ధడక్’ హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. దోస్తానా 2, హెలెన్, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, మిలి, రూహి, గుంజన్ సక్సేనా సినిమాలు చేశారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్నారు. నటన కంటే తన అందాలతోనే సోషల్ మీడియాను ఆమె షేక్ చేస్తున్నారు. నెట్టింట ఆమె పోస్టులకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
బాలీవుడ్‌లో ఇప్పటికే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ కపూర్.. దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టారు. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక తనకు ఉందని గతంలో చెప్పిన జాన్వీ.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది దక్షిణాదిలో జాన్వీ తన రెండవ చిత్రాన్ని చేయనున్నారని సమాచారం. కోలీవుడ్‌లో ఆమె అరంగేట్రం చేస్తున్నారట.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
Also Read: Asian Games 2023 BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా!
జాన్వీ కపూర్‌ను సీనియర్ హీరో కమలహాసన్ కోలీవుడ్‌లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘లవ్ టుడే’ సినిమా డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథం కథానాయకుడిగా.. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నిర్మాతగా కమలహాసన్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఇందుకు సంబంధించి చర్చలు కూడా కమల్ జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమలహాసన్ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు సమచారం.
‘విక్రమ్’ సినిమాతో కమలహాసన్ బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌న్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు కమల్ వరుసగా చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. స్టార్ హీరోలు శింబు, శివకార్తికేయన్‌లతో ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథంతో మరో సినిమా కూడా లైన్‌లో పెట్టారు.
Also Read: Ben Stokes Record: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు