JanaSena Account Hacked: జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక ‘X’ ఖాతా హ్యాక్ అయినట్లుగా ఆ పార్టీ ఐటీ విభాగం గుర్తించింది. నిన్న (08 నవంబర్) సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అకౌంట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకోవడంతో పార్టీ ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది. ఇక సైబర్ టీమ్ చేసిన విశ్లేషణలో హ్యాక్ చేసిన వ్యక్తులు యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుంచి ఈ అకౌంట్‌లో లాగిన్ అయినట్లుగా ఆధారాలు గుర్తించారు. హ్యాకర్లు ఈ అకౌంట్‌ను ఉపయోగించి బిట్‌కాయిన్, క్రిప్టో ట్రేడింగ్ లింక్‌లను షేర్ చేసి, ఫాలోవర్లను మోసం చేసే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు.
Pawan Kaalyan: డిప్యూటీ సీఎం పర్యటనలో అపశృతి.. తోపులాటలో మహిళ కాలిపై వెళ్లిన వాహనం
ప్రస్తుతం జనసేన పార్టీ ఐటీ విభాగం ఈ హ్యాక్ అయిన అకౌంట్‌ను తిరిగి రికవరీ చేసే ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. తమ అకౌంట్ ద్వారా షేర్ అవుతున్న ట్రేడింగ్ లేదా బిట్‌కాయిన్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని పార్టీ కార్యకర్తలు నాయకులకు, ప్రజలకు జనసేన సూచన చేసింది. ఈ విధమైన లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ హెచ్చరికలు జారీ చేసింది.