Nadendla Manohar: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో.. 85,350 మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: ప్రభుత్వ నిర్ణయాల వల్ల 85,350 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందంటూ ఫైర్ అయ్యారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఎస్ఈ విద్యార్థుల భవితవ్యంపై నాదెండ్ల సీరియస్ కామెంట్లు చేశారు.. ప్రభుత్వ తప్పిదాల వల్ల 85 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు.. సీబీఎస్ఈ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిమిత్తం ప్రభుత్వం కట్టాల్సిన ఎగ్జామినేషన్ ఫీజు ఇప్పటి వరకు కట్టలేదన్న ఆయన.. ఈ మొత్తం సుమారుగా రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. ఈ 85 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయలేకపోతే.. వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మారుస్తున్నామంటూ వారిని జీవితాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అయితే, ఈ పాపంలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్పేం లేదు.. కానీ, జగన్ మామ చేసిన పాపం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 44,639 పాఠశాలల్ని 2024 నాటికి సీబీఎస్ఈ కిందకు తెస్తామని జగన్ సర్కార్ చెప్పింది.. కానీ, కేవలం 1000 స్కూళ్లకే సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురాగలిగారని.. ఆ వేయి పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల్లేవు అని దుయ్యబట్టారు నాదెండ్ల.. పరీక్షలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితుల్లో వేయి సీబీఎస్ఈ పాఠశాలలు ఉన్నాయి. వేయి పాఠశాలల్లో సైన్స్ లాబరేటరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 700కు పైగా పాఠశాలల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. అలాగే, లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయలేదు. 40 వేలకు పైగా కంప్యూటర్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం 12 వేల కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ వసతులు లేనిదే సీబీఎస్ఈ పరీక్షలు రాయడం కుదరదు. ఈ విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాయాలా..? స్టేట్ సిలబస్ పరీక్షలు రాయాలా..? బిడ్డల భవిష్యత్తును ఇంత దారుణంగా నాశనం చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నాదెండ్ల మనోహర్.. సీబీఎస్ఈనే అమలు చేయలేని వారు.. ఐబీ సిలబస్ ఎలా అమలు చేస్తారు..? మరో రెండు నెలల్లో పరీక్షలు రాయాల్సి ఉండగా 85 వేల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మార్చి నెలలో జరిగే పరీక్షల్లో వీరికి ఇబ్బంది లేకుండా చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మేం అన్ని ఆధారాలతోనే వరుస ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నాం అన్నారు. మేం మీడియాతో మాట్లాడితే ఏదో విమర్శించేసి వెళ్లిపోవడం సరైన విధానం కాదు. నియోజన్ సంస్థ కోర్టుకెళ్తే.. ప్రభుత్వం అర్బిట్రేషన్ చేయాల్సిన అవసరమేంటి..? నియోజన్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఏంటో మంత్రి అమర్నాథ్ విడుదల చేయగలరా? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!