Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు అక్కడి ఉగ్రవాద హ్యాండ్లర్లకు భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారం పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయ గూఢచారి సమాచారం మేరకు పంజాబ్ పోలీస్‌లు మాధోపూర్ ప్రాంతంలో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, దేశవిరోధ శక్తులు, ఉగ్రవాద హ్యాండ్లర్లకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్లు బయటపడ్డాయి. ప్రాథమిక దర్యాప్తులో సైన్య…