Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది
- జనాన్ని చూసి ఓర్వలేక ఆంక్షలు
- గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరన్నారు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని ఫైర్ అయ్యారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవసరం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారు అని జగ్గంపూడి రాజా పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో మాజీ సీఎం వైఎస్ పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. రాష్ట్రంలో వైఎస్ జగన్‌కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు. మీ పరామర్శలకు ఇన్ని ఆంక్షలు ఉన్నాయో ఓసారి గుర్తుచేసుకోండి’ అని అన్నారు.
Also Read
Also Read: YS Jagan: రెంటపాళ్లకు మాజీ సీఎం జగన్.. అడుగడుగునా నీరాజనం!
‘కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను తెప్ప తగలేశారు.సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం డబ్బులు ఏవి?. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేస్తాం. వాలంటీర్లు నెత్తిన శఠగోపం పెట్టారు. ఎండీయూ వాహనాలను తొలగించి రేషన్ కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు’ అని జగ్గంపూడి రాజా మండిపడ్డారు.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!