సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన “జైలర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జైలర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి.ఈ సినిమాలో సూపర్ స్టార్ రజని లుక్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనితో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన హాట్ బ్యూటి తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు..అయితే తమిళ్ మరియుతెలుగు వంటి దక్షిణాది భాషల్లో రజనీకాంత్ క్రేజ్ తోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం కేవలం సూపర్ స్టార్ క్రేజ్ తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ను కూడా వాడుకుంటున్నారు మేకర్స్.
ఈ మధ్య తమన్నా బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యింది.. అంతే కాకుండా జైలర్ సినిమా నుంచి ఇటీవలే విడుదల అయినా “వా నువ్వు కావాలయ్య “సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. .ఈ పాటలో తమన్నా వేసిన హాట్ స్టెప్స్ బాగా ఆకట్టుకున్నాయి.దీంతో బాలీవుడ్ లో ఈ భామ చేతనే ప్రమోషన్స్ చేయించాలని చూస్తున్నారు మేకర్స్.ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ మరియు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు..జైలర్ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో వివిధ భాషలలో పాపులర్ నటినటులను తీసుకోవడం జరిగింది. దీనితో సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ జరిగితుందని దర్శకుడు నెల్సన్ ఇలా ప్లాన్ చేసారు.ఈ సినిమా ఆగస్టు 10న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఈ సినిమాతో రజనీకాంత్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.