Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jagga Reddy Said Ktr Has No Character

Jagga Reddy-KTR: కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Published Date :August 22, 2025 , 1:45 pm
By Sampath Kumar
  • కేటీఆర్‌‌‌‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు
  • కేటీఆర్‌కి రాజకీయ మెచ్యూరిటీ లేదు
  • అమెరికాలో జీతం మీదనే బతికేవాడు
  • థర్డ్ క్లాస్ అనడానికి మనసు ఎట్లా వచ్చింది
Jagga Reddy-KTR: కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR has no Political Maturity Said Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా?, అప్పుడు చిల్లర అనిపించలేదా? అని విమర్శించారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ సభలో చెప్పారు, ఆ మాట నువ్వు మర్చిపోయావా? అంటూ కేటీఆర్‌‌‌‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే.. ఆ పార్టీ నుంచే పాఠాలు నేర్చుకున్న మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా? అని జగ్గారెడ్డి అన్నారు.

జగ్గారెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియా మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు (కేటీఆర్‌‌‌‌) ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా?. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా, అప్పుడు చిల్లర అనిపించలేదా?. అప్పుడు అనిపించనిది.. ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది?. మీ కుటుంబం వెలిగిపోతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా?. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే.. మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా?. థర్డ్ క్లాస్ నుంచే కదా.. నువ్వు రాజకీయ నాయకుడివి అయ్యింది. వందకోట్ల ప్రజలకు స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అనడానికి మనసు ఎట్లా వచ్చింది. కేటీఆర్.. కాంగ్రెస్ అంటే ఏందో కేసీఆర్‌ని అడిగి తెలుసుకో. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండకపోయేది. అమెరికాలో జీతం మీదనే బతికే వాడివి నువ్వు. నీ కుటుంబం ఏం చేసి బతుకుతుండేనో మరి’ అని ఫైర్ అయ్యారు.

‘సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పెడితే తెలంగాణ బిడ్డగా ఆయనకు ఓటేయాల్సింది పోయి.. ఉల్టా కాంగ్రెస్ మీదనే ఆరోపణలు చేస్తావా?. కేటీఆర్, కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉన్నా రాజకీయ మెచ్యూరిటీ రాలేదు, అందుకే మాటకు దొర్లుతున్నాడు. కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ తాత-నానమ్మ బతికి ఉంటే.. ఆయన్ను పిలిచి తిట్టే వారు. అసవరం అనుకుంటే చెంప మీద కొట్టేవాళ్ళు. కేటీఆర్‌కు త్యాగాల విలువ తెలియదు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయగలడా?. తిని దీక్ష చేసినా.. యాక్సెప్ట్ చేసే వాళ్ళు. అప్పుడు పరిస్థితి అది. కేసీఆర్ దీక్ష అంత కాంగ్రెస్ డిజైన్. మా వాళ్ళ బాధ మా వాళ్ళది.. జానారెడ్డి ముందుండి చేశారు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Also Read: HIgh Court: కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో బిగ్ షాక్!

‘తెలంగాణ వచ్చి ప్రజలకు బెనిఫిట్ ఏమైందో తెలియదు కానీ.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం బాగా బెనిఫిట్ అయ్యింది. కేటీఆర్‌కి రాజకీయ మెచ్యూరిటీ లేదు. కేటీఆర్ తొందరపడి మాట్లాడి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. సచివాలయంలో నేను రివ్యూ చేశా.. దానిపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా మొగొన్నే. సచివాలయంలో దందా చేస్తే తప్పు కానీ.. ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పా. మళ్ళీ మళ్ళీ చేస్తా. మీ లెక్క కొడుకు, అల్లుడు, బిడ్డలు పంచుకున్నట్టు పంచుకున్నానా?. గెలుపు, ఓటమి కాదు.. నేను కూడా రాజకీయ నాయకున్నే కదా?. కిషన్ రెడ్డి మంచోడు, సౌమ్యుడు. ప్రాబ్లం ఏంటంటే.. ఆయన కూడా స్క్రిప్ట్ లీడర్. రాసి ఇచ్చింది చదువుతాడు. పొలిటికల్ స్పీచ్లు ఇవ్వలేడు. యూరియా మీరు ఇవ్వకుండా.. మాట్లాడితే ఏం లాభం. కేంద్రమే ఇవ్వాలి యూరియా. వేల కోట్లు రైతులకు ఇచ్చే రేవంత్ రెడ్డికి ఎరువులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • jagga reddy
  • Jagga Reddy Comments
  • Jagga Reddy KTR

తాజావార్తలు

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

  • Off The Record: పార్టీ తనను సరిగా వాడుకోవడం లేదని ముద్రగడ ఫీలింగ్..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions